ఇషాంత్, రోహిత్ ల పరిస్థితి పై జై షా క్లారిటీ..

ఇషాంత్, రోహిత్ ల పరిస్థితి పై జై షా క్లారిటీ..

నిన్న భారత్-ఆసీస్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ... ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ రావడం పై చాలా గందరగోళంగా ఉందని, అతని విషయంలో బీసీసీఐ ఓ క్లారిటీ ఇవ్వడం లేదు అని అన్నాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యల నేపథ్యంలో రోహిత్ పరిస్థితి పై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మ తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఐపీఎల్ ముగిసిన తర్వాత అతను నేరుగా ఆసీస్ వెళ్లకుండా భారత్ కు వచ్చాడని తెలిపాడు. కానీ ఇప్పుడు తన తండ్రి ఆరోగ్యం మెరుగుకావడంతో తిరిగి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)కి వచ్చాడని అన్నారు. అతనికి వచ్చే నెల 11న ఫిట్నెస్ పరీక్షా నిర్వహిస్తాం అని.. అందులో రోహిత్ తన ఫిట్నెస్ నిరూపించుకుంటే... ఆసీస్ కు వెళ్తాడు అని అన్నారు. అలాగే ఈ పర్యటనలో టెస్ట్ జట్టుకు ఎంపికైన పేసర్ ఇషాంత్ శర్మ తన గాయం నుండి కోలుకున్నాడు కానీ మ్యాచ్ కు కావాల్సిన ఫిట్నెస్ సాధించలేకపోతున్నాడు.. కాబట్టి అతను ఈ పర్యటనను నుండి తప్పుకునట్లు క్లారిటీ ఇచ్చాడు.