జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి` స్టార్ట్..

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి` స్టార్ట్..

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రజల నోట అమ్మా అని పిలుపించుకున్న జ‌య‌ల‌లిత బయోపిక్ వెండితెరపై కనిపించబోతోంది.. "త‌లైవి" పేరుతో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక, అమ్మ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ నటిస్తుండగా.. లెజెండ్రీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్రన్(ఎంజీఆర్‌) పాత్రలో అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు. ఈ మూవీకి ఏఎల్‌ విజ‌య్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌. సింగ్ నిర్మిస్తున్నారు.