జయరామ్‌ హత్య కేసు: రాకేష్‌రెడ్డిపై పీడీ యాక్ట్..

జయరామ్‌ హత్య కేసు: రాకేష్‌రెడ్డిపై పీడీ యాక్ట్..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదైంది. రాకేష్‌రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ ఏసీపీ. దీంతో ఏడాది వరకు జైలు నుండి రాకేష్‌ రెడ్డి విడుదల అయ్యేందుకు అవకాశం లేకుండా పోయింది. కాగా, చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రస్తుతం చంచల్ గూడ జైల్‌లో ఉన్నాడు రాకేష్‌ రెడ్డి.