జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్టు...విడుదల

జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్టు...విడుదల

అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్త ఇంటి సమీపంలో గోడ నిర్మాణంపై ఆరా తీయడానికి వెళ్లిన జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జేసీతో పాటు యామినీబాల, బీటీ నాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకే జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం వెళ్లినట్లు తెలుస్తోంది. బండలు నాటిన స్థల వివాదం కోర్టులో ఉందని మొదట ఆయనకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దివాకర్ రెడ్డి ఆ గ్రామంలోకి వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీసు భద్రత మధ్య ఇళ్లకు తరలించారు.