ముగ్గురు సిట్టింగులను మార్చాలి: జేసీ

ముగ్గురు సిట్టింగులను మార్చాలి: జేసీ

అనంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టుపట్టారు. కనీసం ముగ్గురు సిట్టింగులను మారిస్తే తప్ప అనంత లోక్ సభ గెలవలమని జేసీ పేర్కొన్నారు. ఎంపీ జేసీ శుక్రవారం అమరావతిలో టీడీపీ స్క్రినింగ్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... మూడు సీట్లను మార్చమని (సింగనమల, కళ్యాణ దుర్గం, గుంతకల్లు) స్క్రీనింగ్ కమిటీకి సూచించా. స్క్రీనింగ్ కమిటీ నేను చెప్పిన విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిందో? లేదో? తెలీదన్నారు. కొన్ని సీట్ల విషయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఏ, బీ, సీ అంటూ ఏదో చెబుతున్నారు. సిట్టింగులను మార్చినా.. గట్టిగా పోరాడాల్సి ఉంటుందన్నారు. సిట్టింగులను మార్చకుంటే అనంత లోక్ సభ సీటులో ఓటమి తప్పదు, నేను ఓడేందుకు సిద్దంగా లేను. పార్టీ మారను కానీ.. పోటీ చేయాలో లేదో ఆలోచిస్తా అని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.