రివర్స్ టెండరింగ్‌ పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

రివర్స్ టెండరింగ్‌ పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలోనే మొట్టమొదటి పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని మంత్రి నిన్న అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ విషయం మీద వివాదాస్పద టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచి నిర్ణయమేనని అన్నారు.

ప్రజాధనం ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందేనని కానీ ఆ పేరుతో ప్రభుత్వం-కాంట్రాక్టర్లు కుమ్మక్కైతే మాత్రం తప్పు అన్నారు. ఈ పనిలో నష్టమొచ్చినా ఇంకో పనిలో సర్థుతామని ప్రభుత్వం అంటే అది తీవ్రమైన తప్పు అని రివర్స్ టెండర్లోనూ పాత కాంట్రాక్టర్‌కే పనులు దక్కడం సంతోషమని అన్నారు. డబ్బులు మిగుల్చుతున్నాం అనే పేరుతో సంవత్సరాల పాటు సాగదీయడం మంచిది కాదన్నారు దివాకర్‌ రెడ్డి.