జేసీ సంచలన వ్యాఖ్యలు... 'రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం'...!

జేసీ సంచలన వ్యాఖ్యలు... 'రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం'...!

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆరోగ్యశ్రీ విషయంలో సీఎం జగన్‌ను సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో రెడ్లకు ఎక్కువ పోస్టులు ఇచ్చినందుకు అభినందిస్తున్నానని అన్నారు. అయితే, చంద్రబాబుకు అది చేతకాలేదని వ్యాఖ్యానించారు జేసీ. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీలో సీఎం జగన్ బాగా మాట్లాడారని ప్రశంసించిన జేసీ... వైఎస్ జగన్ హయాంలో.. తాత రాజారెడ్డి పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కామెంట్లపై స్పందించిన జేసీ... మాఫియా ఉందని ఆనం మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. అయితే, ఏపీలో రెడ్ల రాజ్యం నడుస్తోందని... ప్రభుత్వానికి ''రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం'' అని పేరు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు జేసీ.