సీఎంపై జేసీ సంచలన వ్యాఖ్యలు..! పార్టీ మారాలంటూ ఒత్తిడి..!

సీఎంపై జేసీ సంచలన వ్యాఖ్యలు..! పార్టీ మారాలంటూ ఒత్తిడి..!

సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు జేసీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొందరిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన జేసీ.. ఏపీలో పాలన హద్దుమీరి సాగుతోందన్నారు. పార్టీలో చేరితే కేసులు ఉండవని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ.. తమ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పటి వరకు 80 బస్సులు సీజ్ చేశారని విమర్శించిన జేసీ దివాకర్ రెడ్డి.. బస్సు టైంకు రాలేదని కూడా సీజ్ చేస్తున్నారు.. ఇది ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ చెప్పినా ఆర్టీవో అధికారులు బస్సులు వదిలిపెట్టడంలేదని ఫైర్ అయ్యారు. ఇక, ఆర్డీవో అధికారి వరప్రసాద్‌పై కేసు వేయనున్నట్టు వెల్లడించారు జేసీ.. ట్రావెల్స్ సీజ్ చేయడం వల్ల కలిగిన నష్టాన్ని అధికారులే కట్టాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కొందర్ని ఆర్థికంగా, మానసికంగా శిక్షిస్తున్నారని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి.. చింతమనేని ప్రభాకర్‌పై రోజుకో కేసు పెడతారా? అంటూ ఫైర్ అయ్యారు.