జగన్ పై జెసి సంచలన వ్యాఖ్యలు.. ఆయన వలనే...!!

జగన్ పై జెసి సంచలన వ్యాఖ్యలు.. ఆయన వలనే...!!

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా పధకాలు ప్రవేశపెడుతూ దూసుకుపోతున్నది.  జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అయన పాలనను జాగ్రత్తగా గమనిస్తున్న వ్యక్తుల్లో మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఒకరు.  కాగా, ఈరోజు జగన్ వైఎస్ రైతు భరోసా పధకం ప్రవేశపెట్టారు.  ఈ పధకం ప్రవేశపెట్టిన తరువాత.. జెసి దివాకర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  

జగన్ పాలన గురించి మాట్లాడాలి అంటే మరో ఆరునెలలు ఆగాలని అన్నారు.  ఆరు నెలల తరువాత జగన్ పాలన గురించి ఓ క్లారిటీ వస్తుందని చెప్పారు.  మోడీ మోడీ మంత్రదండం కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చారని చెప్పి సంచలనం సృష్టించారు. జగన్ కు మంచి చెడు గురించి విడమరిచి చెప్పేవారు లేరని, దాని వలన తీసుకునే నిర్ణయాల్లో మంచి చెడు రెండు ఉన్నయని అన్నారు.  ఇప్పటి వరకు జగన్ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తున్న జెసి.. ఇప్పుడు హఠాత్తుగా మోడీ వలనే జగన్ అధికారంలోకి వచ్చారని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  జెసి వ్యాఖ్యలపై వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి.