'బీజేపీ నుంచి నాకు ఆఫర్‌ వచ్చింది'

'బీజేపీ నుంచి నాకు ఆఫర్‌ వచ్చింది'

భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనకు ఆహ్వానం వచ్చిందని మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో ఇవాళ ఆయన విలేఖరులతో ముచ్చటించారు. బీజేపీ నుంచి ఆఫర్‌ వచ్చిందని.. కానీ.. చేరుతానని లేదా చేరబోనని తాను చెప్పలేదని తెలిపారు. ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ హుందాగా వ్యవహరించారన్న జేసీ.. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి ఇలా ఉంటాడని తాను అనుకోలేదని అన్నారు. తాను భయపడి జగన్‌ను పొగడడం లేదని, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని స్పష్టం చేశారు. భయపడుతున్నానో లేదో 6 నెలల తర్వాత చూస్తారని చెప్పారు. ఇక.. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలన్న జేసీ.. చంద్రబాబుకు కూడా అదే చెప్పానని తెలిపారు.