నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను

నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను

జనసేన నాయకుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్దం రోజురోజుకు ముదురుతోంది.  తాజాగా, వీవీ లక్ష్మీనారాయణ, జనసేనను ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్  బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి' అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి జేడీ లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. 

'గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను. దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు' అంటూ ట్వీట్ చేశారు.

'మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు' అంటూ జేడీ లక్ష్మీనారాయణ చరుకలంటించారు.