జేడీ కొత్త పార్టీ పేరు జనధ్వని..?

జేడీ కొత్త పార్టీ పేరు జనధ్వని..?

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ పెట్టబోతున్న రాజకీయ పార్టీ పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో  చర్చ జోరుగా సాగుతోంది. జేడీగా సుప్రసిద్ధుడైన ఆయన తన పార్టీ పేరును అలాగే స్ఫురించేలా జనధ్వని అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉంది. ఈనెల 26న ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ లో భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఇప్పటికే కొంతమందికి ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. భేటీకి హాజరయ్యే వారి నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేసే అవకాశముందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.