శ్రీదేవి గురించి జెడి ఏం చెప్పాడో తెలుసా..?

శ్రీదేవి గురించి జెడి ఏం చెప్పాడో తెలుసా..?

అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తు మరణించింది.  శ్రీదేవి లేని లోటు తీర్చలేనిదని చెప్పాలి.  శ్రీదేవితో కలిసి పనిచేసిన వాళ్లలో జెడి చక్రవర్తి కూడా ఒకరు.  శ్రీదేవి గురించిన కొన్ని విషయాలను హిప్పీ సినిమా ప్రమోషన్స్ సమయంలో జెడి మీడియాతో పంచుకున్నారు.  

శ్రీదేవి చెల్లెలు మహేశ్వరీతో కలిసి గులాబీ సినిమా చేస్తున్న సమయంలో.. మహేశ్వరీ చెన్నైలో శ్రీదేవి ఇంట్లోనే ఉండేది.  ఓసారి శ్రీదేవి ఇంటికి లంచ్ కు వెళ్ళినపుడు.. శ్రీదేవి తల్లి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగిందట.  దీంతో జెడి షాక్ అయ్యాడు. ఈ విషయం శ్రీదేవికి చెప్తే.. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని.. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని.. ఏ విషయాన్ని కొద్దిసేపు కంటే ఎక్కువ సమయం గుర్తుంచుకోలేరని చెప్పింది.  

ఇదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మతో చెప్తే.... వర్మ జెడి తో గొడవ పెట్టుకున్నాడని జెడి ఈ సందర్భంగా చెప్పడం విశేషం.