కేసీఆర్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ

కేసీఆర్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ

జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవెగౌడను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తరువాత దేవెగౌడ నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరారు. అయితే ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహానికి దేవెగౌడ వచ్చిన విషయం తెలిసిందే.