మేం అందుకే రాలేదు...

మేం అందుకే రాలేదు...

జేడీఎస్ శాసన సభ పక్ష సమావేశానికి హాజరుకాకపోవడానికి కారణం తాము 450 కి.మీ దూరంలో ఉండటమే అన్నారు జేడీఎస్ మిస్సింగ్ ఎమ్మేల్యేలు ఇద్దరు. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకీ సరైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ రాజకీయం రసకందాయకంగా మారింది. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశాని జేడీఎస్ లో  ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాము ఎక్కడికీ పోలేదని.. తాము కుమారస్వామితోనే ఉంటామని స్పష్టం చేశారు. ఉదయం జరిగిన జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి 38మంది ఎమ్మెల్యేలలో 36 మందే హాజరైన విషయం తెలిసిందే. వెంకటరావు నాదగౌడ, రాజా వెంకటప్ప నాయక అనే ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ ఇద్దరు జేడీఎస్‌కు రాంరాం చెప్పి బీజేపీలోకి వెళ్లారని పుకారు విపరీతంగా షికారు చేసింది. జేడీఎస్ సంఖ్యాబలంపైనే అనుమానాలు మొదలయ్యాయి. వీటన్నింటికీ చెక్ చెప్తూ ఆ ఇద్దురు ఎమ్మెల్యేలు స్పందించారు. తాము బెంగళూరుకు 450 కిమీల దూరంలో ఉన్నామని.. అందుకే సమయానికి చేరుకోలేకపోయామని అన్నారు.