రాజ్‌భవన్ బయటే కుమారస్వామి...

రాజ్‌భవన్ బయటే కుమారస్వామి...

కర్నాటకలో రాజకీయ హైడ్రామా నడుస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కర్ణాటక గవర్నర్ బీజేపీపీ ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ నేతలకు రాజ్‌భవన్ నుంచి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్‌భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కుమారస్వామి రాజ్‌భవన్‌ బయటే ఉండిపోయారు. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకపోతే.. బెంగళూరులో లక్షమందితో ధర్నా చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సన్నాహాలు చేస్తోంది.

అంతకుముందు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్ వజుభాయ్ వాలాను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కలిశారు. జేడీఎస్ నేత కుమార స్వామి గవర్నర్‌కు రెండు లేఖలు సమర్పించారు. మరోవైపు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ను కలవబోతున్నారు. అనంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.