రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం సోమవారం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 1.65 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షకు నమోదు చేసుకోగా, వీరిలో తెలంగాణ నుంచి సుమారు 20 వేల మంది ఉన్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ లో మొత్తం ఆరు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఇందుకోసం ఐఐటీ రూర్కీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.