నేటి నుండి జేఈఈ మెయిన్...

నేటి నుండి జేఈఈ మెయిన్...

నేటి నుండి ఈ నెల 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ లో హైద్రాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ ,కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం,నిజమా బాద్, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్ బాద్ లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మొదటి సారిగా ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.  హిందీ,ఇంగ్లీషు, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషలో ఈ పరీక్షా జరగనుంది. గతేడాది కోవిడ్ నిబంధనలు ఈ సారి కూడా వర్తిస్తాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షలు.

ఉదయం 9 నుండి 12 గంటకు వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పత్రం లో మార్పులు.... ఈ సారి విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు ఛాయిస్ కోసం ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనున్నారు. తెలంగాణ లో 73 వేల 782 మంది విద్యార్థులు పరీక్షా రాయనున్నారు. నాలుగు సార్లు జేఈఈ మెయిన్ రాసే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ , మే లలో పరీక్షలు జరుగుతుతాయి. విద్యార్థి ఇష్టం మేరకు ఎన్ని సార్లైనా పరీక్ష రాయొచ్చు. తెలుగులో 374 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ సారి జేఈఈ మెయిన్ కి ఇంటర్ పరీక్షలో పాస్ అయితే చాలు. పరీక్షా రాయడం కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానములో ఉంది. అయితే నిర్ణిత సమయం కంట అరగంట ముందే పరీక్ష కేంద్రాల లో రిపోర్ట్ చేయాలి.