పవన్ కళ్యాణ్ పై జాలి వేసింది

పవన్ కళ్యాణ్ పై జాలి వేసింది

పవన్ కళ్యాణ్‌పై జాలి వేసింది, భీమవరంలో గెలుస్తాడని అనుకున్నానని సినీ దర్శకురాలు, వైసీపీ నాయకురాలు జీవిత రాజశేఖర్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని తెలిపారు. అంకితభావంతో కష్టపడిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైసీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైసీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను' అని జీవిత అన్నారు.