లేటు వయసులో టాప్ గేర్ లో...

లేటు వయసులో టాప్ గేర్ లో...

గ్లామర్ ప్రపంచంలో ఎదగాలంటే... దానికి తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించాలి.  గ్లామర్ పాత్రలు చేయాలి.  దాంతో పాటు యువతను ఆకట్టుకునే ఫోటో షూట్ లతో పిచ్చెక్కించాలి.  ఇలా చేస్తేనే... న్యూస్ లో ఉంటారు.  పది మందికి పరిచయం అవుతారు.  పదిరకాల అవకాశాలు వస్తాయి.  ఇలా అవకాశాలు దక్కించుకోవడంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ముందు వరసలో ఉంది.  

ఇటీవలే 50 వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు... లేటెస్ట్ గా హార్పర్ బజార్ అనే మ్యాగజైన్ కు ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో టాప్ లేపుతోంది.  టాప్ లెస్ తో చేసిన ఈ ఫోటో షూట్ యువతను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది.  పుట్టిన రోజు వేడుకలకు జెన్నీ మాజీ భర్త బ్రాడ్ పిట్ కూడా హాజరయ్యాడు.  ఏంజలీనా జోలీ తో విడాకులు తీసుకున్న తరువాత బ్రాడ్ పిట్ మాజీ భార్యకు తిరిగి దగ్గర కాబోతున్నారని సమాచారం.