నాని హీరోయిన్ తో చైతు సినిమా

నాని హీరోయిన్ తో చైతు సినిమా

నాగచైతన్య కెరీర్లో మజిలీ భారీ హిట్ గా చెప్పొచ్చు.  ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు మంచి కిక్ ఇచ్చింది.  మజిలీ తరువాత ప్రస్తుతం నాగచైతన్య వెంకిమామ చేస్తున్నాడు.  వెంకటేష్ మరో హీరో.  మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

ఈ సినిమా తరువాత నాగచైతన్య మరో సినిమాకు సైన్ చేశాడు.  దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఓ లవ్ ఓరియంటెడ్ సినిమాలో చైతు నటించబోతున్నాడు.  ఇందులో నాని జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తోందట.  జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  జెర్సీ మంచి హిట్ కొట్టడంతో శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు వస్తున్నాయి.  శశి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.