రివ్యూ: జెర్సీ

రివ్యూ: జెర్సీ

నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు

మ్యూజిక్: అనిరుధ్‌ రవిచందర్‌

సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి

గత కొంతకాలంగా నాని హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.  కొత్త కొత్త ప్రయోగాలు చేసినా పెద్దగా కలిసిరాడం లేదు.  ఈసారి ఏకంగా క్రికెట్ ప్రధానాంశంతో జెర్సీ సినిమా చేశాడు.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  మరి అది ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.  

కథ : 

నాని ఎంతగానో ప్రేమించిన శ్రద్దా శ్రీనాథ్ ను పెళ్లి చేసుకుంటాడు.  భార్య అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం.  ఎంత బాగా ఆడినప్పటికీ జాతీయ జట్టులో స్థానం లభించదు.  దీంతో విసిగెత్తిన నాని, క్రికెట్ కు దూరం అవుతున్నాడు.  స్పోర్ట్స్ కేటగిరిలో ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది కూడా దూరం అవుతుంది.  నానికి జాబ్ లేకపోవడంతో... కుటుంబం అంతా శ్రద్దా శ్రీనాథ్ పై ఆధారపడుతుంది.  ఇదే సమయంలో నానికి కొడుకు పుడతాడు.  కొడుకు తన పుట్టిన రోజున జెర్సీ గిఫ్ట్ కావాలని అడుగుతాడు.  ఆ గిఫ్ట్ కొనేందుకు నాని చాలా ఇబ్బందులు పడతాడు.  జెర్సీ కోసం భార్యతో కూడా గొడవపడతాడు.  కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వలేని తండ్రి అనవసరం అని చెప్పి ఎలాగైనా తిరిగి తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి క్రికెట్ ఆడటం మొదలుపెడతాడు.  36 ఏళ్ల వయసులో నాని ప్రయత్నం సాధ్యమయిందా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్న ఓ యువకుడు జీవితంలో ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది.  అదే సమయంలో కుటుంబంలో భార్యపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే ఎలా ఉంటుంది.  కొడుకు పుట్టిన తరువాత కూడా ఆధారపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే జెర్సీ.  కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు అన్ని ఈ సినిమాలు మనకు కనిపిస్తాయి.  క్రికెట్ కు దూరమైనపుడు నాని ఎమోషన్స్ ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుంది.  కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ ను కూడా తండ్రి కొనివ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనం చూడొచ్చు.  ఫస్ట్ హాఫ్ లో కొడుకు కోడం తండ్రి పడే ఆవేదనను చూపించారు.  కొన్ని సన్నివేశాలు మనకు హత్తుకునే విధంగా ఉంటాయి.  

సెకండ్ హాఫ్ లో కొడుకు ముందు తండ్రి హీరోగా నిలబడేందుకు తండ్రి చేసే ప్రయత్నం గురించి సినిమాలో చూపించారు.  సెకండ్ హాఫ్ అంతా క్రికెట్ చుట్టూనే కథ నడుస్తుంది.  తాను గతంలో కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవడానికి పడే తపనను చూపించారు.  క్లైమాక్స్ సినిమాకు హార్ట్ పాయింట్ గా నిలిచింది.  కథను అనుగుణంగా స్క్రీన్ ప్లే నడిచింది తప్పించి ఎక్కడ సైడ్ ట్రాక్ తప్పలేదు.  

నటీనటుల పనితీరు: 

నాని చాలా హుషారుగా నటించాడు.  ఎమోషన్స్ సీన్స్ లో నాని చాలా బాగా నటించి మెప్పించాడు.  తండ్రిగా, క్రికెటర్ గా, భర్తగా చాలా బాగా నటించాడు.  శ్రద్దా శ్రీనాథ్ పాత్ర చాలా కీలకమైనది.  తన సహజ నటనతో ఆకట్టుకుంది.  నాని కొడుకు క్యారెక్టర్ సినిమాకు హైలైట్. మిగతా నటీనటులు తమ పరితిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథను చాలా సహజసిద్ధంగా నడిపించారు.  ఎమోషన్స్ స్టోరీస్ లో డ్రామా ఎక్కువగా ఉంటుంది.  దానికి కనిపించకుండా సహజంగా తీర్చి దిద్దటం విశేషం.  అనిరుద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.  సాంగ్స్ సహజ సిద్ధంగా ఉంటాయి తప్పించి ట్రాక్ తప్పే విధంగా ఉండదు.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటుల పనితీరు 

ఎమోషన్ సీన్స్ 

క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్: 

స్లో నెరేషన్ 

చివరిగా: ఎమోషన్స్ హార్ట్ టచింగ్ స్టోరీ