జెట్ నుంచి వైదొలిగిన నరేష్ గోయల్, అనితా గోయల్

జెట్ నుంచి వైదొలిగిన నరేష్ గోయల్, అనితా గోయల్

జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనీతా గోయల్ ఎయిర్ లైన్ బోర్డ్ కి రాజీనామా చేశారు. నరేష్ గోయల్ చైర్మన్ పదవి కూడా కోల్పోనున్నారు. రుణదాతలతో పాటు రెజెల్యూషన్ ప్లాన్ పై సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జెట్ ఎయిర్వేస్ పై రూ.8000 కోట్లకు పైగా రుణభారం ఉంది. ఎయిర్ లైన్ దివాలా తప్పించుకోవాలంటే అత్యవసరంగా నగదు కావాలి. జెట్ కి అప్పు ఇచ్చిన బ్యాంకులు మేనేజ్ మెంట్ మారితే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని గత వారం తెలిపాయి. 

ఎయిర్ లైన్ రోజువారీ వ్యవహారాలు చూసేందుకు తాత్కాలిక మేనేజ్ మెంట్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జెట్ రుణదాతల బోర్డులో ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తారు. ఎస్బీఐ నేతృత్వంలో ఎయిర్ లైన్ రుణదాతల కన్సార్షియం రెజొల్యూషన్ ప్లాన్ తయారు చేస్తోంది. ఇందులో జెట్ రుణాలను షేర్లరూపంలోకి మార్చడం, రూ.1,500 కోట్ల ఫండింగ్ వెంటనే ఇవ్వడం ఉన్నాయి.

గోయల్ రాజీనామా నిర్ణయం వార్త రాగానే ఎయిర్ లైన్ షేర్ వేగం పుంజుకుంది. ఎన్ఎస్ఈలో ఈ షేర్ 15.46% పెరిగి రూ.261 దగ్గర క్లోజైంది. బీఎస్ఈలో 12.69% పెరిగి రూ.254.50 దగ్గర ముగిసింది.