జెట్‌ నిలిచిపోయింది

జెట్‌ నిలిచిపోయింది

ఇవాళ రాత్రి 10.30 గంటలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ చివరి విమానం ఎగరనుంది. దాంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ తాత్కాలికంగా మూతపడనుంది. రోజువారి నిర్వహణకు కూడా నిధులు లేకపోవడంతో కంపెనీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు కంపెనీ నిధుల కోసం ప్రయత్నించిందని, ఫలితం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి కేవలం 35 నుంచి 40 సర్వీసులు నడుపుతున్న విమానం... సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కనీసం రూ. 400 కోట్లు ఇస్తే విమానాలు నడుపుతామని కంపెనీ సీఈబీ వినయ్‌ దూబే బ్యాంకులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. తాత్కాలిక రుణం ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వచ్చినా... ప్రైవేట్‌ బ్యాంకులు ససేమిరా అన్నారు. ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం కొత్తగా ఆస్తులను తాకట్టుపెట్టడం, తాము విధించే షరతులకు కంపెనీ అంగీకరించాలని పట్టుబట్టింది. చర్చలు ఫలించకపోవడంతో జెట్‌ సర్వీసులు ఆగిపోయాయి.