బాలీవుడ్ లో మహిళా క్రికెటర్ బయోపిక్

బాలీవుడ్ లో మహిళా క్రికెటర్ బయోపిక్
ఇది ముమ్మాటికీ బయోపిక్ ల కాలమే.  భాషతో సంబంధం లేకుండా అటు నార్త్, ఇటు సౌత్ లలో బయోపిక్ సినిమాలు వరసగా వస్తున్నాయి.  క్రీడాకారుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని తీస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.  క్రికెటర్ల జీవిత కథల ఆధారంగా వచ్చే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.  
 
మహ్మద్ అజహరుద్దీన్, మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితాల ఆధారంగా ఇప్పటికే బయోపిక్ సినిమాలు వచ్చాయి.  ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ప్రస్తుతం కపిల్ దేవ్ జీవితాన్ని కబీర్ ఖాన్ వెండితెరపైకి తీసుకొస్తున్నాడు.  కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు.  ఇప్పుడు అదే స్పూర్తితో మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవితాన్ని తెరకెక్కించబోతున్నారు సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ.  ప్రస్తుతం ఈ సంస్థ జులన్ కథను డెవలప్ చేస్తోంది. స్ర్కిప్ట్ పూర్తికాగానే, దునామిస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
 
34 సంవత్సరాల జులన్ గోస్వామి అస్సాంలోని చక్ దహా ప్రాంతంలో జన్మించింది.  ఇక అంతర్జాతీయ క్రికెట్లో 164 వన్డేలు ఆడిన జులన్ 195 వికెట్లు పడగొట్టి, మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.  జులన్ బయోపిక్ కోసం అనేక పేర్లు పరిశీలించిన తరువాత, ఈ సినిమాకు చక్ దహా ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టినట్టు తెలుస్తోంది.