నీషమ్‌ సిక్సర్‌ చూసి.. కోచ్‌కు హార్ట్‌ ఎటాక్‌..!

నీషమ్‌ సిక్సర్‌ చూసి.. కోచ్‌కు హార్ట్‌ ఎటాక్‌..!

మూడు రోజుల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ బోలెడంత వినోదాన్ని, ఉత్కంఠను పంచింది. మ్యాచ్‌ చప్పగా సాగుతోందని అనుకుంటుండగా హైఓల్టేజ్‌ డ్రామాను తలపించింది. బాల్‌కో మలుపు తిరిగిన ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌కు మాత్రం విషాదాన్ని మిగల్చింది. సూపర్ ఓవర్‌లో నీషమ్‌ కొట్టిన సిక్సర్‌తో మ్యాచ్‌ మరింత ఉత్కంఠ రేపింది. ఈ టెన్సన్‌ను తట్టుకోలేక అతని చిన్ననాటి హైస్కూల్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని గోర్డాన్ కూతురు స్వయంగా వెల్లడించింది. మ్యాచ్ సూపర్ ఓవర్ చేరుకోగానే  గోర్డాన్ శ్వాసలో మార్పు వచ్చిందని.. నీషమ్ సిక్స్ చూడగానే ప్రాణాలు కోల్పోయారని ఆమె తెలిపింది. 
డేవిడ్ జేమ్స్ గోర్డాన్ మృతిపై నీషమ్‌ ట్వీట్‌ చేస్తూ సంతాపం ప్రకటించాడు. గొర్డాన్‌కు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన నీషమ్‌.. ఆయన దగ్గర క్రికెట్‌ నేర్చుకోవడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఫైనల్స్‌లో తమ ఆటతీరును చూసి గోర్డాన్‌ కచ్చితంగా గర్వించి ఉంటారని పేర్కొన్న నీషమ్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నానంటూ ట్వీట్‌ చేశాడు.