కాస్త తగ్గినా జియోనే టాప్‌!

కాస్త తగ్గినా జియోనే టాప్‌!

అన్నీ ఉచితమంటూ టెలికం మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారిఫ్‌లు అమలు చేస్తూ కూడా తన యూజర్లను క్రమంగా పెంచుకుంది. ఇక డేటా డేటా స్పీడ్‌లోనూ టాప్‌స్పాట్‌లోనే కొనసాగుతోంది జియో... గత ఏడాది డిసెంబరు నెలలో జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 8 శాతం తగ్గి 18.7 ఎంబీపీఎస్‌గా నమోదైనట్టు ట్రాయ్‌ పేర్కొంది. అయితే, గత నెల కంటే స్పీడు కాస్త తగ్గినా ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్‌వర్క్‌లలో జియోనే టాప్‌లో ఉన్నట్టు వెల్లడించింది. గత 12 నెలల్లోనూ జియోనే అగ్ర స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ వేగం కాస్త పెరిగింది... 2018 నవంబర్‌లో 9.7ఎంబీపీఎస్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ డేటా వేగం... డిసెంబర్‌లో 9.8ఎంబీపీఎస్‌గా నమోదైనట్టు ట్రాయ్‌ తెలిపింది. అయితే, అప్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం ఐడియా టాప్‌లోనే ఉంది... ఐడియా అప్‌లోడ్‌ వేగం నవంబర్‌లో 6.6ఎంబీపీఎస్‌గా ఉండగా, అది డిసెంబర్‌లో అది 5.3ఎంబీపీఎస్‌గా నమోదైంది.