జియో సరికొత్త ప్లాన్స్.. ఇక పండగే..!

జియో సరికొత్త ప్లాన్స్.. ఇక పండగే..!

రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది.. ప్రీపెయిడ్ యూజర్లకు ఒకే ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్‌ అందిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా 'ఆన్‌ ఇన్ వన్' ప్లాన్ తీసుకొచ్చిన జియో.. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు తన నెట్‌వర్క్ పరిధిలో అన్‌లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్ అందిస్తోంది. ఇక ప్లాన్స్‌ను బట్టి నాన్ జియో ఫ్రీ కాల్స్ సంఖ్య 3 వేల నిమిషాల వరకు ఉంది. నాన్ జియో కాల్స్‌కు ప్రస్తుతం నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్న జియో.. ఆ కాల్స్ కోసం ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను జియో పలు ప్లాన్ల రేట్లను తగ్గించి, వాటిలో నాన్ జియో కాల్స్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. 

"ఆల్ ఇన్ వన్" పేరుతో పలు ప్లాన్లను తీసుకొచ్చింది జియో.. ఇది రూ.222 నుంచి ప్రారంభం కానుండగా.. రూ.333, రూ.444, రూ.555 కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. అయితే, గతంలో ఉన్న ప్లాన్లను కుదించింది జియో.. ఇప్పటి వరకు రూ.448 ప్లాన్ ఉండగా.. దానిని రూ.444కు, రూ.396 ప్లాన్ రూ.333కు అందిస్తోంది. దీంతో కొత్త ప్లాన్లు వినియోగదారులకు 20 నుంచి 50 శాతం తక్కువ రేట్లకే లభ్యం కానున్నాయి. ఇక ప్లాన్లను బట్టి వాలిడిటీ నిర్ణయించింది జియో.. రూ.222 ప్లాన్‌కు 28 రోజుల వాలిడిటీ ఉండగా.. రూ.333 ప్లాన్‌కు 56 రోజుల వాలిడిటీ ఉంది. ఈ రెండు ప్లాన్ల కింద వేయి నాన్ జియో కాల్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇక, రూ.444, రూ.555 ప్లాన్ల వాలిడిటీ 84 రోజులు ఉంది. అయితే, ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లకు 3వేల నిమిషాల నాన్ జియో కాల్స్ ఫ్రీగా లభిస్తాయి.