థియేటర్లకు వెళ్లకుండానే ఫస్ట్ డే సినిమా చూడొచ్చు..!!

థియేటర్లకు వెళ్లకుండానే ఫస్ట్ డే సినిమా చూడొచ్చు..!!

స్టార్ హీరోల సినిమా వచ్చింది అంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని అందరూ అనుకుంటారు.  కానీ, టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటారు.  స్టార్ హీరో సినిమా అంటే టిక్కెట్ రేట్లు భారీగా ఉంటాయి.  బ్లాక్ లో టిక్కట్లు కొనాలి అంటే సాధ్యం కానిపని. అందుకే చాలా మంది తరువాత చూద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ ఉంటారు.  కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు.  

ఇంట్లోనే కూర్చొని అభిమాన హీరో సినిమా రిలీజైన రోజునే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాను కుటుంబంతో కలిసి కూర్చొని చూడొచ్చు.  రిలయన్స్ అంబానీకి చెందిన జియో ఫైబర్ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నది.  2020 నుంచి దీనిని అమలులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది జియో ఫైబర్.  అమెజాన్, నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ కారణంగా థియేటర్లకు జనాలు రావడం లేదు.  

మరోవైపు పైరసీ ఎఫెక్ట్ తో కొత్త సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి.  ఇప్పుడు జియో ఫైబర్ ఫస్ట్ డే ఫస్ట్ షో అఫర్ పధకాన్ని తీసుకొస్తే.. థియేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటాయి అనడంలో సందేహం లేదు.  జియో ఫైబర్ కు ఈ రకమైన అనుమతులు ఇవ్వొద్దని మల్టీప్లెక్స్ గ్రూప్స్ పివిఆర్, ఐనాక్స్ డిమాండ్ చేస్తున్నాయి.