నేటి నుంచే జియో ఫ్లాష్ సేల్ 

నేటి నుంచే జియో ఫ్లాష్ సేల్ 

జియో ఫోన్-2 తో మరో సంచలనం సృష్టించాలనుకుంటున్నారు ముఖేశ్ అంబానీ. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచే జియో ఫోన్ 2 పేరుతో ఫీచర్ ఫోన్ ఆన్ లైన్లో అమ్మకాలకు సిద్ధమైపోయింది. ఈ అప్ గ్రేడెడ్ ఫీచర్ ఫోన్లో వాట్సాప్, ఫేస్ బుక్, యూ-ట్యూబ్ అందుబాటులో ఉంటుంది. ధర రూ. 2,999 గా నిర్ణయించారు. జియో ఫోన్ ప్రయోగంతో ఒక్క ఏడాదిలోనే 2.5 కోట్ల మంది జియో యూజర్స్ ను సృష్టించుకున్న ముఖేశ్.. కొత్తగా వచ్చే జియో ఫోన్-2 తో మరో 10 కోట్ల ఖాతాదారులను సొంతం చేసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

క్వెర్టీ కీప్యాడ్‌తో జియో ఫోన్ 2 వస్తున్నది. జియో ఫోన్-2 ధ‌ర రూ.2999గా ఉండ‌గా, వినియోగ‌దారులు త‌మ పాత ఫీచ‌ర్ ఫోన్‌ను వెన‌క్కిచ్చి కేవ‌లం రూ. 501కే కొత్త జియో ఫోన్‌ను పొంద‌వ‌చ్చు. జియో ఫోన్-2 వినియోగ‌దారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 పేరిట ప్రత్యేకమైన ప్లాన్ లని ప్రకటించింది. 

ముందు విడుద‌లైన జియో ఫోన్ డిస్‌ప్లేకు పూర్తి భిన్నంగా ఈ ఫోన్‌లో హారిజాంటల్ డిస్‌ప్లేను తీసుకొచ్చారు. రిలయెన్స్ ఈ మధ్యే మాన్‌సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద యూజర్లు తమ పాత ఫీచర్‌ను ఇచ్చి కేవలం రూ.501కే జియో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.