సంచలనం సృష్టించేందుకు జియో గిగా ఫైబర్ రెడీ..!!

సంచలనం సృష్టించేందుకు జియో గిగా ఫైబర్ రెడీ..!!

ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికే జియో సంచనలం సృష్టించింది.  ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి.. జియో గిగా ఫైబర్ ను విపణిలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది.  రిలయన్స్ నుంచి ఇప్పటికే బ్రాండ్ బ్యాండ్, టివి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఇవి ట్రయల్ రన్ అవుతున్నాయి.  ఆగష్టు 12 వ తేదీ నుంచి వాణిజ్యపరంగా ఈ గిగా ఫైబర్ అందుబాటులోకి రానున్నది.  దేశంలోని 1100 నగరాల్లో దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ గిగా ఫైబర్ చార్జీలు ఎంత.. నెలకు ఎంతమొత్తంలో వసూలు చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది.  

జియో ఫైబర్‌ నుంచి మూడు వేర్వేరు ప్లాన్లు ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంటర్నెట్‌, టీవీ, ఐఓటీ సేవల్లో ఏదో ఒకటి ఎంచుకొనే సదుపాయం లేదా మూడూ ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉండనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ ను ప్రవేశపెట్టనుండగా.. నెలవారీ ఛార్జీ రూ.500 నుంచి రూ.వెయ్యి మధ్య ఉండే అవకాశముంది. అధికారికంగా టారీఫ్‌ ఛార్జీలు సంస్థ వెల్లడించాల్సి ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 2500 నుంచి రూ. 4000 వరకు వసూలు చేస్తారని సమాచారం.