జియో మరో బంపరాఫర్.. రూ.4కే 1 జీబీ డేటా..!

జియో మరో బంపరాఫర్.. రూ.4కే 1 జీబీ డేటా..!

టెలికం సంస్థ రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్‌ తీసుకొచ్చింది.. ఇప్పటికే ‘వర్క్‌ ఫ్రం హోం’ పేరుతో పనులు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇంటర్నెట్‌ డేటాను అధికంగా ఉపయోగించే వినియోగదారుల మరో ఆఫర్ తీసుకొచ్చింది... ఈ ప్యాకేజ్‌ ధర రూ.999గా నిర్ణయించింది.. 84 రోజులపాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 3జీబీ చొప్పున డేటా అందించనుంది జియో.. డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో నుంచి జియో నంబర్లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఉచితంగా అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌ను చేసుకునే అవకాశం కల్పించింది.. శుక్రవారం ప్రకటించిన రూ.999 'వర్క్‌ ఫ్రం హోం' ప్లాన్‌లో రోజుకు 3 జీబీ చొప్పున 84 రోజుల పాటు డేటా వినియోగించుకునే వెసులుబాటు ఉండడంతో మొత్తం 252 జీబీ డేటా వాడుకోవచ్చు.. ఈ లెక్కన.. 1 జీబీ డేటా దాదాపు రూ.4 అంటే.. కేవలం రూ.3.96 మాత్రమే పడనుంది. ఇక, టెలికాం ఆపరేటర్ రూపొందించిన కొత్త త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 599 మరియు రూ. 555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలు వరుసగా 2 జీబీ మరియు 1.5 జీబీ యొక్క రోజువారీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను అందిస్తాయి.