జియో న్యూ ప్లాన్స్...! మీరే చూడండి...

జియో న్యూ ప్లాన్స్...! మీరే చూడండి...

టెలికం రంగంలో అడుగు పెడుతూనే జియో సంచలనం సృష్టించింది.. అన్ని ఫ్రీ అంటూ ఆకట్టుకున్నా ఆ సంస్థకే చెందింది.. ఆ తర్వాత టారిప్ ప్లాన్స్ అమలు చేసినా.. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేసినా జియోకే చెల్లింది. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమలు కాబోతున్నాయి.. ఇప్పటికే మిగతా సంస్థలు ముక్కుపిండే కార్యక్రమం ప్రారంభించగా.. జియో 6వ తేదీ నుంచి కొత్త ప్లాన్స్ అమలు చేయనుంది. దీని కోసం జియో ప్రస్తుతం సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ పేరుతో కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. దీని ద్వారా సరికొత్త అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని ప్రకటించింది. 

ఈ ప్లాన్స్‌లో వరుసగా నెల, రెండు నెలలు, మూడు నెలలు, 12 నెలలకు గాను రూ.199, రూ.399, రూ.555, రూ.2,199 ప్లాన్స్ తెచ్చిన జియో.. తన నెట్‌వర్క్‌లోని కాల్స్‌కు అపరిమిత ఉచిత కాల్స్ అందిస్తుంది. ఇక, ఈ ప్లాన్స్‌లో నెల ప్యాకేజీకి 1000 నిమిషాలు, 2 నెలల ప్లాన్‌కు 2 వేల నిమిషాలు, 3 నెలల ప్లాన్‌కు 3 వేల నిమిషాలు, 12 నెలల ప్లాన్‌కు 12 వేల నిమిషాలు ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు అందిస్తోంది. ఇవే కాక.. జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్స్‌ వివరాలు, వ్యాలిడిటీ, డేటా, ఇతర పూర్తి వివరాలను కింది టేబుల్‌లో గమనించవచ్చు...