రూ.99కే 14 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్...

రూ.99కే 14 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్...

టెలికం రంగంలో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన జియో... ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లతో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు... తన పాత కస్టమర్లకు సరికొత్త ఆఫర్లు ఇస్తూ వస్తుంది. తాజాగా జియో ఫోన్ వినియోగదారులకు సరికొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది జియో... కేవలం రూ .99 రీఛార్జ్ ప్యాక్‌తో 14 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్ అందిస్తోంది. 28 రోజు కాలపరిమితో ఉండే ఈ ఆఫర్‌ కింది రోజుకు 0.5 జీబీ చొప్పు మొత్తం 14 జీబీ డేటా ఇస్తోంది జియో. ఉచితం 300 ఎస్‌ఎంఎస్‌లకు కూడా అవకాశం ఉంది. అయితే ఇది కేవలం జియో ఫోన్లలో వాడే సిమ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో రూ. 99 ఆఫర్ దాని మాన్సూన్ హంగామా ఆఫర్‌తో పాటు ఆవిష్కరించింది.