జియో ద్వితీయ వార్షికోత్సవ కానుక ఇదే...

జియో ద్వితీయ వార్షికోత్సవ కానుక ఇదే...

జియో టెలికాం రంగంలోకి అడుగు పెట్టి రెండేళ్లయిన సందర్భంగా కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ఇస్తున్నారు. రూ.100కే అపరిమిత కాల్స్‌, డేటా ఇస్తున్నట్టు కంపెనీ వెబ్ సైట్ పేర్కొంటోంది. ఈ ఆఫర్‌ను మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు. ఆఫర్‌ను అందించేందుకు ఫోన్‌ పేతో జియో ఒప్పందం కుదుర్చుకున్నారు. జియో రూ.399కి 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తోంది. దీని మీద రూ.100 డిస్కౌంట్‌ తో రూ.299కే ఉచిత సేవలు అందిస్తోంది. తాజా ఆఫర్‌తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్‌, రోజుకు 100 మెసేజ్‌లు వినియోగించుకునే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్‌ ప్లాన్‌లో రెండు ఆప్షన్లున్నాయి. 
జియో యాప్‌ ద్వారా రీచార్జ్‌‌ చేసుకున్నప్పుడు రూ.50 క్యాష్‌బ్యాక్‌ వోచర్లు వస్తాయి. వోచర్లపై రూ.50 ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. మై జియో యాప్‌లో ఉన్న ఫోన్‌ పే ఆప్షన్‌ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రూ.50 ఇన్‌స్టెంట్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ ఆఫర్‌ ఈ నెల 12 నుంచి 21 వరకే వర్తిస్తుంది.