జియో గుడ్‌ న్యూస్.. ఈ ఆఫర్ పొడిగింపు..!

జియో గుడ్‌ న్యూస్.. ఈ ఆఫర్ పొడిగింపు..!

జియో ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది.. దీపావళి సందర్భంగా జియో తెచ్చిన ఆఫర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. రూ.1500 విలువైన జియో ఫోన్‌ను దీపావళి ఆఫర్‌లో రూ.699కే అందిస్తోంది జియో.. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చిన మూడు వారాల్లోనే జియోఫోన్ సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది జియో. రూ.1500 విలువైన ఫోన్‌ను రూ.699కే అందిస్తుండడంతో పాటు.. పైగా, ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయకుండానే ఫోన్‌ను కొనే సౌకర్యాన్ని పండగ సందర్భంగా కల్పించింది జియో. దీంతో పాటు.. 2 జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీలోకి అప్‌గ్రేడ్ అవుతారని జియో అంచనా.. రూ.808 చెల్లిస్తే జియో ఫోన్‌తో పాటు ఒక నెల రీఛార్జ్ పొందే వీలు కల్పించింది.. రూ.1006 చెల్లిస్తే ఫోన్, 3 నెలల రీఛార్జ్ కూడా అందిస్తోంది. జియో నిర్ణయంతో నవంబర్ 30వ తేదీ వరకు జియో ఫోన్లపై ఆఫర్ అందుబాటులో ఉంటుంది.