జియో మరో బంపరాఫర్.. రూ.699కే ఫోన్..!

జియో మరో బంపరాఫర్.. రూ.699కే ఫోన్..!

టెలికం రంగంలో ఎంట్రీతోనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు సర్‌ప్రైజ్ ఆఫర్లు ఇస్తూ.. ఇతర టెలికం సంస్థలకు కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఇక దసరా, దీపావళి సందర్భంగా మరో బంపరాఫర్ ప్రకటించింది జియో... ఎలాంటి ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌ లేకుండా జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా ఇప్పుడు కేవలం రూ.699కే అందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఫోన్‌ను కొన్నవారికి మొదట 7 రీచార్జ్‌లపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను కూడా ఉచితంగా అందివ్వనుంది జియో.. అయితే, ఈ ఆఫర్ కేవలం దీపావళి వరకే అందుబాటులో ఉండనుంది. ఈ బంపరాఫర్ ఈ నెల 4వ తేదీ నుంచి అమలుచేయనున్నట్టు జియో ప్రకటించింది. కాగా, కైయోస్ ఆధారిత జియో ఫోన్ 2.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.2 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పాటు 512 ఎంబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మైక్రో ఎస్‌డీ కార్డ్ 128 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. వై-ఫై కనెక్టివిటీతో పాటు 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.