లోక్ సభకు కన్నయ్య పేరు ఖరారు

లోక్ సభకు కన్నయ్య పేరు ఖరారు

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నయ్యకుమార్ లోక్ సభకు పోటీ చేయబోతున్నాడు. బిహార్లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి తరఫున పోటీ చేయడం దాదాపుగా ఖరారైందని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ తో పాటు ఆయన తనయుడు తేజస్వీయాదవ్ కూడా ఇందుకు అంగీకరించినట్లు సమాచారం. బెగుసరాయ్ నుంచి 2014 ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ మీద గెలిచిన బీజేపీ అభ్యర్థి భోలాసింగ్ ను ఈసారి మహాకూటమి తరఫున ఓడించి.. సీపీఐ అభ్యర్థిగా కన్నయ్యను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఆర్జేడీ.. మహాకూటమి ఒప్పందంలో భాగంగా బెగుసరాయ్ ని కన్నయ్యకు వదిలేయాల్సి వస్తోంది.