ఆ కేసులో సల్మాన్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు

ఆ కేసులో సల్మాన్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు ఐదేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.  రెండు రాత్రులు జైల్లోనే గడిపిన తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది.  ఇక ఇదే కేసులో సల్మాన్ తన తుపాకీ లైసెన్స్ పేపర్లు పోయాయని కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆయనపై ఇంకో కేసు నమోదైంది.  కేసును విచారించిన అనంతరం కోర్టు నిజంగానే సల్మాన్ లైసెన్స్ పేపర్లు పోగొట్టుకొన్నారని, వాటి రెన్యూవల్ కోసం అప్లై చేసుకున్నారని, ఇందులో ఆయన కోర్టును మోసం చేయడానికి ప్రయత్నించలేదని తేల్చి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.