మూడు మార్పులతో రెండో టెస్ట్ బరిలోకి ఇంగ్లాండ్...

మూడు మార్పులతో రెండో టెస్ట్ బరిలోకి ఇంగ్లాండ్...

వెస్టిండీస్‌తో తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఓడిన ఇంగ్లాండ్ ఈ రోజు జరగాల్సిన రెండో టెస్ట్  మ్యాచ్ల కోసం మూడు మార్పులతో తమ జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి). మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరమైన  రెగ్యులర్ కెప్టెన్ జో రూట్.. మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, అలాగే యువ ఆల్ రౌండర్ పేసర్ శామ్ కరన్‌ ను టీమ్‌లోకి వచ్చారు. మొదటి టెస్ట్ లో అంతగా రాణించలేకపోయిన ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, మార్క్‌వుడ్‌‌లకి రెస్ట్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీమ్ వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, శామ్ కరన్‌లని తీసుకుంది. ఇక జో రూట్ జట్టులోకి రావడంతో.. స్టోక్స్ ను కెప్టెన్ బాధ్యతల నుండి తప్పించగా జట్టు నుండి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జె డెన్లీ ను తొలగించారు.  మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్ మన భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల కు ప్రారంభంకానుంది.

ఇంగ్లాండ్ జట్టు  : జో రూట్ (కెప్టెన్), జోప్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాక్ క్రావ్లీ, శామ్ కరన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్‌సన్, డోమ్ సిబ్లీ, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్