ప్రపంచ కప్ పతకాన్ని పోగొట్టుకొని తర్వాత..?

ప్రపంచ కప్ పతకాన్ని పోగొట్టుకొని తర్వాత..?

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వారం క్రిందట ఇల్లు మారేటప్పుడు తన ప్రపంచ కప్ పతకాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఈ రోజు ఆర్చర్ తన 'గెస్ట్ బెడ్ రూమ్' ను శోధిస్తూ తన విలువైన పతకం తిరిగి పట్టుకున్నాడు. తన ఫ్లాట్‌లో ప్రపంచ కప్ పతకం ఒక వారం పాటు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నానని చెప్పాడు. ఆర్చర్ తన వద్ద ఉన్న ప్రపంచ కప్ 2019 పతకం తన ఇంట్లో గోడకు వేలాడుతోందని, ఆ తర్వాత అతను తన కొత్త ఇంటికి వెళ్లానని ఇక అక్కడ తన పతకం కనిపించలేదని తెలిపాడు. ఆ తరువాత "నేను ఒక వారం పాటు ఇంటిని మొత్తం వెతికాను, కాని నేను దానిని కనుగొనలేకపోయాను. అయితే అది ఇంట్లో ఉండాలని నాకు తెలుసు కానీ అది నాకు కనిపించడం లేదు అని తెలిపాడు.  ఇక ఆ తరువాత ఈ రోజు ఆర్చర్ తన 'గెస్ట్ బెడ్ రూమ్' ను వెతుకుతూ తన విలువైన పతకాన్ని  తిరిగి కలిశానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ఇక దీనిని జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపాడు. ఇక 2019 ఫైనల్లో వివాదాస్పద బౌండరీ లెక్కింపుల కారణంగా ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.