బాబు పతనం దగ్గర్లోనే ఉంది: జోగి రమేష్‌

బాబు పతనం దగ్గర్లోనే ఉంది: జోగి రమేష్‌

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు పోలీసులు ఇచ్చిన రిమాండ్‌ రిపోర్టుకు సమాధానం చెప్పాలని వైసీసీ నేత జోగి రమేష్ డిమాండ్‌ చేశారు. ముమ్మాటికే హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టు వెల్లడించిందని ఆయన తెలిపారు. తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెంపలేసుకోవాలనీ, ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీజీపీతో సహా అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పతనానికి ఇంకో నాలుగునెళ్లు మాత్రమే ఉందని జోస్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే అని విష ప్రచారాలు చేస్తున్న మతి లేని ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకోవాలని రమేష్‌ హితవు పలికారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని జోగి రమేష్ స్పష్టం చేశారు.