అజ్ఞాతంలోకి జోగు రామన్న...అందుకేనా ?

అజ్ఞాతంలోకి జోగు రామన్న...అందుకేనా ?

ఆదిలాబాద్‌లోని జోగురామన్న ఇంటి వద్ద ఆయన అభిమానులు ఘర్షణకు దిగారు. జోగు రామన్నకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం నువ్వంటే, నున్వంటూ ఓ మైనార్టీ నాయకుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. పరిస్థితి విషమించి కార్యకర్తలు కాలర్లు పట్టుకోని కొట్టుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేసినా ఆగకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. మరోవైపు జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు.

కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి బెర్త్ దక్కకపోవడంతో ఆయన అలకబూనారని, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా గన్ మెన్ లను కూడా వదిలి ఎక్కడికో వెళ్లిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కేబినెట్లో జోగు రామన్న పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన అదృశ్యం జిల్లాలో సంచలనంగా మారింది. తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందని జోగు రామన్న భార్య రమ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాదిన ఆమె మంత్రి పదవి రాకపోవడంతో తన భర్తకు బీపీ ఎక్కువైందని, అనారోగ్యం కారణంగానే తాను కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారని సమాచారం.