అందుబాటులోకి సింగిల్ డోస్ కరోనా టీకా...

అందుబాటులోకి సింగిల్ డోస్ కరోనా టీకా...

కరోనా మహమ్మారిపై పోరాటానికి మరో కొత్త టీకా అందుబాటులోకి వచ్చింది.  జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. అమెరికాలో ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి.  కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన మూడో టీకా కూడా అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసింది అమెరికా.  ఈరోజు నుంచే ఈ టీకాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  వేగంగా విస్తరిస్తున్న దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ ను సమర్ధవంతంగా అడ్డుకోగలుగుతుందని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.  ఇక హైదరాబాద్ లోని బయోలాజికల్ ఈ సంస్థ ఈ టీకాను ఉత్పత్తి చేస్తుంది.