తెలంగాణలో బీజేపీ జోరు.. త్వరలో భారీ చేరికలు

తెలంగాణలో బీజేపీ జోరు.. త్వరలో భారీ చేరికలు

తెలంగాణలో మరింత పుంజుకునేందుకు బీజేపీ ప్లాన్‌ రెడీ చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాపోలు ఆనంద భాస్కర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డిని చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు మరిన్ని చేరికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్‌ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్‌, సోమారపు సత్యనారాయణలు బీజేపీలో చేరికపై సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం.