సైరా.. వార్ లను దెబ్బకొట్టిన జోకర్..!! 

సైరా.. వార్ లను దెబ్బకొట్టిన జోకర్..!! 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సైరా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.  హిట్ టాక్ తో సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. మెగాస్టార్ కెరీర్లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు వచ్చాయి.  ఈ సినిమాతో పాటు వార్ సినిమాకు కూడా మంచి రేటింగ్ వచ్చింది.  బాలీవుడ్లో దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఫస్ట్ కలెక్షన్ల విషయంలో నయా రికార్డును సొంతం చేసుకుంది.  

అదే రోజున ఈ రెండు సినిమాలతో పాటు హాలీవుడ్ జోకర్ సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ మంచి హిట్ అయ్యింది.  బాలీవుడ్లో జోకర్ రూ. 6 కోట్లరూపాయలు పైగా వసూళ్లు సాధించింది.  కాగా రెండో రోజున జోకర్ సినిమా సైరా, వార్ ను బీట్ చేసింది. అదెక్కడో అనుకోకండి.. చెన్నై నగరంలోనే.  చెన్నై నగరంలో రెండోరోజున జోకర్ రూ. 19లక్షలు వసూలు చేయగా, సైరా, వార్ సినిమాలు రూ. 14 లక్షలు వసూలు చేశాయి.