మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ...

మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ...

విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డు ను కూడా తన ఖాతా లో వేసుకున్నాడు. కోహ్లీ వ‌రుస‌గా నాలుగు వ‌న్డేల్లో ఒకే బౌల‌ర్‌కు త‌న వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ వరుసగా నాలుగు మ్యాచ్ లో కోహ్లీని ఔట్ చేసిన ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ సిరీస్ లోని మూడు వ‌న్డేల్లో కోహ్లీని హేజిల్‌వుడే ఔట్ చేశాడు. అంత‌కు ముందు జనవరి లో ఆసీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు బెంగ‌ళూరులో జ‌రిగిన చివ‌రి వన్డేలోనూ అతడు విరాట్‌ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లీని వ‌రుస‌గా నాలుగుసార్లు ఔట్ చేసిన తొలి బౌల‌ర్‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రెంట్ బౌల్ట్‌, జునైద్ ఖాన్‌, కేన్ రిచ‌ర్డ్‌స‌న్ కోహ్లీని వ‌రుస‌గా మూడుసార్లు ఔట్ చేశారు. కానీ ఇప్పుడు హేజిల్‌వుడ్ వారిని దాటేశాడు.