బీజేపీ జాతీయ చీఫ్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారు

బీజేపీ జాతీయ చీఫ్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరిదశకు వచ్చింది. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మరికొద్దిరోజుల్లో పూర్తికానుంది. ఇప్పటికే బూత్ కమిటీలు.. మండల కమిటీలు... జిల్లా కమిటీలు, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసుకొని... జాతీయ అధ్యక్ష ఎన్నిక వరకు వచ్చింది. ఈ నెల 20న జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్లకు ఈనెల 20న ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అవకాశముంటుంది. అదే రోజు.. నామినేషన్ల స్క్రూటినీ , ఉపసంహరణ ఉంటుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే 21న పోలీంగ్ జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈనెల 22న ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.