విజయ్ దర్శకుడిపై స్టేషన్ లో ఫిర్యాదు

విజయ్ దర్శకుడిపై స్టేషన్ లో ఫిర్యాదు

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో అట్లీ ఒకరు.  తేరి, ఒకరాజా ఒక రాణి, మెర్సల్ అట్లీ నుంచివచ్చినవే.  ఈ మూడు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  ఇందులో తేరి, మెర్సల్ సినిమాలు విజయ్ తో చేయగా... ఈ రెండు సూపర్ హిట్టయ్యాయి.  ప్రస్తుతం విజయ్ తోనే స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, ఈ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ ను అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి ఓ మహిళా ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేసింది.  

సెట్స్ లో త్రాగునీరు, టాయిలెట్ లు సరిగా లేవని దర్శకుడికి చెప్తే.. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిట్టాడని జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణాదేవి నసరత్ పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ చేసింది.  కృష్ణాదేవి ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.  అయితే, ఈ ఇష్యూపై అట్లీ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం.