అఖిల్‌ విల్‌ బి ఫైనెస్ట్‌ ఆర్టిస్ట్‌: ఎన్టీఆర్

అఖిల్‌ విల్‌ బి ఫైనెస్ట్‌ ఆర్టిస్ట్‌: ఎన్టీఆర్

యువ హీరో 'అఖిల్' అక్కినేని, నిధి అగర్వాల్‌ జంటగా న‌టించిన చిత్రం 'మిస్ట‌ర్ మ‌జ్ను'. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే  టీజర్‌, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

మిస్ట‌ర్ మ‌జ్ను ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్‌ టైగర్‌ 'ఎన్టీఆర్‌' ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ... నా తమ్ముడు అఖిల్‌. ఓ నటుడికి ముఖ్యంగా కావాల్సిన ఆత్మ విమర్శ అఖిల్‌లో ఉన్నట్లు ఎవరికీ ఉండదు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. ఎన్నిసార్లు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ.. తనని తాను మార్చుకుంటూ.. తన పంథాని తాను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. రాసిపెట్టుకోండి.. ఈ రోజు నేను చెపుతున్నాను 'అఖిల్‌ విల్‌ బి ఫైనెస్ట్‌ ఆర్టిస్ట్‌ ఇన్ వన్ డే'. అఖిల్‌ గొప్పనటుడు అవుతాడు.. అది ఎంతో దూరంలో లేదు. నేను కూడా మీ అందరితో పాటు ఆరోజు కోసం వెయిట్‌ చేస్తుంటాను. ఈ చిత్రం, అఖిల్‌ కెరీర్‌లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్‌ అన్నారు.